‘వివాహ భోజనంబు’ అంటున్న సందీప్‌కిషన్‌

మొదటి నుంచి విభిన్న కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు కిషన్‌. ఆయనలో చక్కని నటుడు, నిర్మాతతో పాటు మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ఈ అభిరుచితోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వివాహ భోజనంబు’ పేరుతో రెస్టారెంట్లు

Updated : 18 Aug 2020 09:35 IST

హైదరాబాద్‌: మొదటి నుంచి విభిన్న కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్‌. ఆయనలో చక్కని నటుడు, నిర్మాతతో పాటు మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ఈ అభిరుచితోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వివాహ భోజనంబు’ పేరుతో రెస్టారెంట్లు ప్రారంభించి సేవలందిస్తున్నారు. ఇప్పుడాయన ఇదే ‘వివాహ భోజనంబు’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ‘నిను వీడని నీడని నేను’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాల తర్వాత ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. శినిష్‌ అనే మరో నిర్మాతతో కలిసి ఈ తాజా చిత్రాన్ని నిర్మించబోతున్నారు సందీప్‌.

తాజాగా ఈ చిత్ర ప్రీ-లుక్‌ను విడుదల చేశారు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలియజేసింది చిత్ర బృందం. రామ్‌ అబ్బరాజు దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు చిత్ర నాయకానాయికలు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలియజేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని