‘సుశాంత్‌ నా చపాతీలు దొంగిలించేవాడు!

దివంగత కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ తన చపాతీలు (తెప్లా) దొంగతనం చేసేవాడని ఆయన సహ నటుడు జై థక్కర్‌ గుర్తు చేసుకున్నారు. సుశాంత్‌ తల్లి చిన్నతనంలోనే మరణించడంతో ఆమె వంటల్ని మిస్‌ అయ్యాడని, అందుకే అలా చేశాడని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. సుశాంత్‌ నటించిన.....

Updated : 16 Oct 2020 19:26 IST

తన తల్లి చనిపోవడంతో..: సహ నటుడు

ముంబయి: దివంగత కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ తన చపాతీలు (తెప్లా) దొంగతనం చేసేవాడని ఆయన సహ నటుడు జై థక్కర్‌ గుర్తు చేసుకున్నారు. సుశాంత్‌ తల్లి చిన్నతనంలోనే మరణించడంతో ఆమె వంటల్ని మిస్‌ అయ్యాడని, అందుకే అలా చేశాడని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. సుశాంత్‌ నటించిన టీవీ సీరియల్‌ ‘పవిత్ర రిష్తా’ (2014). ఇందులో జై ఆయన చిన్న సోదరుడిగా నటించారు. ఆ సందర్భంగా తమ మధ్య ఏర్పడిన బంధాన్ని జై గుర్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

‘దాదాపు 11 ఏళ్ల క్రితం.. నేను, సుశాంత్‌ అన్నయ్య కలిసి నటించాం. ఇంట్లో మా అమ్మ చేసి తెచ్చిన తప్లాను సుశాంత్‌ అన్నయ్య రోజూ దొంగిలించేవాడు. అమ్మ సెట్‌కు తీసుకొచ్చే నా టిఫిన్‌ బాక్సులోని ఆహారం కనిపించకుండా పోయేది. ఇలానే కొన్ని వారాలపాటు జరిగింది. ‘జై‌ టిఫిన్‌ మీరెవరైనా తింటున్నారా?’ అని అమ్మ సెట్‌లోని కొంతమందిని అడిగింది. ఓ రోజు రాత్రి సమయంలో షూటింగ్‌ జరుగుతుండగా.. సుశాంత్‌ నేరుగా మా అమ్మ దగ్గరికి వచ్చి టిఫిన్‌ బాక్సులోని తప్లా తనే దొంగిలించి, తిన్నట్లు చెప్పాడు. తన తల్లిని మిస్‌ అవుతున్నానని, వాటిని తింటుంటే ఆమె గుర్తొచ్చేదని అన్నాడు. అమ్మకు క్షమాపణలు చెప్పాడు. అప్పటి నుంచి నాతోపాటు సుశాంత్‌ అన్నయ్యకు కూడా తెప్లా తెచ్చేది. నా కన్నతల్లిని ‘అమ్మ’ అని పిలిచేవాడు’’.

‘అలాంటి అన్నయ్య మన మధ్య లేకపోవడం బాధాకరం, నేను నమ్మలేకపోతున్నా. ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఏర్పడింది. నేను, అమ్మ సుశాంత్‌ను చాలా మిస్‌ అవుతున్నాం..’ అని జై‌  సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. దీంతోపాటు సెట్‌లో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని