INPICS: NisChay వివాహ వేదిక చూసొద్దాం రండి..!
నిహారిక కొణిదెల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు మెగా కుటుంబం సిద్ధమయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేసే క్షణం కోసం చిరు కుటుంబంలోని ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో తమ ఇంట్లో....
ఆసియాలోనే ది బెస్ట్ హోటల్ ఇది..!
ఇంటర్నెట్‌డెస్క్: నిహారిక కొణిదెల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు మెగా కుటుంబం సిద్ధమయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేసే క్షణం కోసం చిరు కుటుంబంలోని ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో తమ ఇంట్లో జరగనున్న మొదటి శుభకార్యం కావడంతో ఈ వివాహ వేడుక ప్రతి ఒక్కరికీ ఓ మధుర జ్ఞాపకంగా ఉండేలా నాగబాబు ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆసియాలోనే ది బెస్ట్ హోటల్‌గా పేరొందిన ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను నిహారిక-చైతన్య పరిణయ వేదికగా ఎంపిక చేసింది.
మరికొన్ని రోజుల్లో (డిసెంబర్ 9) వివాహం జరగనుండడంతో ఇప్పటికే నిహారిక-చైతన్య వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఉదయ్ విలాస్ ప్యాలెస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిహారిక షేర్ చేసిన ఓ ఫొటోనే దానికి నిదర్శనం. ప్రపంచంలోనే ది బెస్ట్ ప్యాలెస్ హోటల్స్‌లో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్‌విలాస్‌లో ఇటీవల ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఈశా సంగీత్ వేడుక జరిగింది. ఈ క్రమంలో నిహారిక-చైతన్య పెళ్లి నేపథ్యంలో సదరు హోటల్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్ ఎలా ఉంటుందో చూడాలని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌కు సంబంధించిన సోషల్‌మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఫొటోలు ఆధారంగా ఆ హోటల్ ఎలా ఉంటుందో చూసొద్దాం రండి..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
11 నెలలుగా...జీవచ్ఛవంలా..!.. ఆకతాయిల దాడే కారణం
-
Ap-top-news News
కుప్పంలో చంద్రబాబు ఇంటికి అడ్డంకులు
-
Sports News
రహానె స్కాన్ వద్దన్నాడు
-
Politics News
ఏపీ నేతలకు మాటలెక్కువ.. పని తక్కువ
-
Crime News
అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారు.. తెలంగాణ ఐఏఎస్‌పై భార్య ఫిర్యాదు
-
Movies News
Samantha: సెర్బియా క్లబ్లో సమంత డ్యాన్స్.. వీడియో వైరల్