తమన్నా ఇంట్లో కరోనా కలకలం

ప్రముఖ సినీనటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. తన తల్లిదండ్రులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆమె వెల్లడించింది. ‘‘ఈ వారాంతం.....

Published : 27 Aug 2020 00:39 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. తన తల్లిదండ్రులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆమె వెల్లడించింది. ‘‘ఈ వారాంతం నుంచి అమ్మ, నాన్నకు తేలికపాటి కొవిడ్‌ లక్షణాలు కనబడటంతో ముందు జాగ్రత్తగా అందరం పరీక్షలు చేయించుకున్నాం. ఇప్పుడే ఫలితం వచ్చింది. దురదృష్టవశాత్తు ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బందికి నెగటివ్‌గా తేలింది’’ అని తమన్నా ట్విటర్‌లో పేర్కొంది.  దేవుడి దయవల్ల వారు కొవిడ్‌ను ఎదుర్కోగలుగుతున్నారని, అందరూ చేసే ప్రార్థనలు వారిని మరింత త్వరగా కోలుకొనేలా చేస్తాయని పేర్కొన్నారు.  దీంతో ఆమె ట్వీట్‌కు స్పందించిన అభిమానులు తమన్నా తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని