అంధాధున్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన తమన్నా

బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ కొట్టిన చిత్రం ‘అంధాధున్‌’. నితిన్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మెర్లపాక గాంధీ డైరెక్టర్‌. కథానాయిక ఇస్మార్ట్‌భామ నభా నటేశ్. ఈ సినిమాలో హీరోతో సమానంగా ఓ పవర్‌ఫుల్‌ లేడీ పాత్ర ఉంటుంది. హిందీలో ఆ పాత్రలో

Published : 20 Sep 2020 00:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘అంధాధున్‌’ను నితిన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్టర్‌. కథానాయికగా ఇస్మార్ట్‌భామ నభా నటేశ్ కనిపించనుంది. ఈ సినిమాలో హీరోతో సమాన ప్రాధాన్యత గల ఓ పవర్‌ఫుల్‌ లేడీ పాత్ర ఉంటుంది. హిందీలో ఆ పాత్రలో టబు కనిపించి మెప్పించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అయితే, రీమేక్‌లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై పలు వార్తలు వినిపించాయి. పవర్‌ఫుల్‌ లేడీ పాత్రకు సరిపోయే వారికోసం చిత్ర బృందం బాగానే అన్వేషించింది. మొదట్లో.. తెలుగులో కూడా టబునే నటిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రమ్యకృష్ణ.. అనసూయ.. ఇలియానా చాలా పేర్లు వినిపించాయి. ఆఖర్లో శ్రియ శరణ్‌ ఓకే చెప్పేసిందని, చిత్రీకరణే ఆలస్యమని కూడా అన్నారు. అయితే, చిత్రబృందం వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

మిల్కీబ్యూటీ తమన్నా తమ రీమేక్‌కు ఓకే చెప్పిందని ప్రకటించింది. టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్‌ కనిపించనున్నారని చెప్పింది. నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. టుబు పాత్రను తమన్నా ఛాలెంజింగ్‌గా తీసుకుందని చిత్రబృందం పేర్కొంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూర్చనున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని