ప్రకాశ్‌రాజ్‌కి గాయాలు

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఆయన చేతికి గాయాలు కావడంతో శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కి తరలివచ్చారు.

Updated : 11 Aug 2021 07:27 IST

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఆయన చేతికి గాయాలు కావడంతో శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కి తరలివచ్చారు. చెన్నైలో ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రకాశ్‌రాజ్‌. మంగళవారం ఆ సెట్లోనే గాయపడ్డారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం శస్త్రచికిత్స అవసరం కావడంతో హైదరాబాద్‌కి వచ్చారు. ‘‘చిన్న ప్రమాదం జరిగింది. కంగారు పడాల్సిందేమీ లేదు. శస్త్రచికిత్స కోసం నా స్నేహితుడు డా.గురువారెడ్డి దగ్గరికి వస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని