ఫస్ట్‌లుక్‌తో.. ‘అన్నాత్తే’

రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ రూపొందిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు   పోషిస్తున్నారు. ప్రస్తుతం

Updated : 10 Sep 2021 07:52 IST

రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ రూపొందిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు   పోషిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఉదయం 11గంటలకు, మోషన్‌ పోస్టర్‌ను సాయంత్రం 6గంటలకు   విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గురువారం సామాజిక   మాధ్యమాల వేదికగా ఓ ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో రజనీ విలాసవంతమైన భవనాలున్న ప్రాంతానికి ముందు గడ్డిలో నుంచొని కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో ఓవైపు శూలాలు, మరో పక్క కొన్ని దేవుని ప్రతిమలు కనిపించాయి. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా.. దీపావళి సందర్భంగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, కెమెరా: వెట్రి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని