రామోజీ ఫిల్మ్‌సిటీలో బంగార్రాజు

‘బంగార్రాజు’ జోరు మీదున్నారు. నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ  సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మైసూర్‌లో ఇటీవలే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ

Updated : 13 Sep 2021 07:32 IST

‘బంగార్రాజు’ జోరు మీదున్నారు. నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ  సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మైసూర్‌లో ఇటీవలే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ నెల 14 నుంచి రామోజీ ఫిల్మ్‌   సిటీలో చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ సిద్ధం చేశారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున జీ   స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతున్న సినిమా ఇది. తొలి చిత్రమూ సంక్రాంతికే వచ్చి ఘన విజయం  సాధించింది. పండగ సినిమాగా ముస్తాబవుతున్న ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాము రమేష్‌, చలపతిరావు, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: యువరాజ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని