
పడదే.. పడదే.. ఫ్రెండయితే సరిపడదే
విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎనిమి’. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ కథానాయికలు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని శనివారం విడుదల చేశారు. ‘‘పడదే.. పడదే.. ఫ్రెండయితే సరిపడదే’’ అంటూ సాగుతున్న ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. పృథ్విచంద్ర ఆలపించారు. విశాల్.. మృణాళినిల కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇద్దరు మిత్రులు శత్రువులుగా ఎందుకు మారారు? ఈ ఇద్దరి పోరులో అంతిమంగా గెలుపెవరిది? అన్నది చిత్ర కథాంశం. ఓ ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. సెప్టెంబరులో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కూర్పు: రేమండ్ డెరిక్ కాస్ట్రా, ఛాయాగ్రహణం: డి.రాజశేఖర్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.