
మనసుకు బాధగా అనిపించింది
వైవిధ్యభరిత మాస్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరు కథానాయకుడు గోపీచంద్. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకుడు. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే కథతో రూపొందింది. తమన్నా కథానాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు గోపీచంద్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
* ‘‘గతంలో సంపత్ నందితో కలిసి ‘గౌతమ్ నందా’ చేశా. అది ఆశించినంతగా ఆడలేదు. ఆ సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అందుకే ఈసారి అలాంటి వాటికి తావివ్వకుండా మంచి చిత్రం చేయాలని అనుకున్నాం. సంపత్ తొలుత విద్యకు సంబంధించిన ఓ కథ చెప్పారు. అదంత నచ్చలేదు. తర్వాత కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ కథ చెప్పాడు. వినగానే నచ్చింది. నేను ఇప్పటి వరకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయలేదు. అందుకే ఈ స్క్రిప్ట్‌తోనే ముందుకెళ్దామని చెప్పా. అలా 2019లో ఆఖర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు కరోనా ఉద్ధృతి పెరగడంతో సినిమా ఆపేశాం. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకునే లోపు మరో లాక్‌డౌన్ వచ్చింది. అలా అనుకోకుండా ఆలస్యమైంది’’.
* ‘‘ఇందులో నేను ఆంధ్రప్రదేశ్ మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపిస్తా. నాకొక లక్ష్యం ఉంటుంది. దానికోసం కొంతమంది అమ్మాయిలతో కలిసి కబడ్డీ టీమ్ తయారు చేసుకుని ముందుకెళ్తా. ఈ క్రమంలో అనేక సవాళ్లెదురవుతాయి. వాటిని మేమెలా దాటాం? లక్ష్యాన్ని ఎలా సాధించాం? అన్నది మిగతా కథ. సినిమాలో కబడ్డీ ఆటతో పాటు సిస్టర్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యముంటుంది. వీటన్నింటినీ వాణిజ్యాంశాలతో ముడిపెడుతూ సంపత్ కథ అల్లిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. సినిమాలో ప్రేక్షకులతో సీటీ కొట్టించే ఎమోషనల్, యాక్షన్స్ చాలా ఉన్నాయి’’.
* ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఓవైపు సరదాగా.. మరోవైపు సీరియస్‌గా సాగుతుంది. తమన్నా తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ జ్వాలా రెడ్డి అనే పాత్రలో కనిపిస్తుంది. కథలో ఎంతో ప్రాధాన్యమున్న బలమైన పాత్ర ఆమెది. ఈ సినిమా కోసం నలుగురు నిజమైన కబడ్డీ క్రీడాకారులను తీసుకున్నాం. వాళ్లే తెరపై కనిపించే మిగతా ఆటగాళ్లకు సెట్లో శిక్షణ ఇచ్చారు. కబడ్డీ ఆటగాళ్లుగా వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పినప్పుడు.. మనసుకు చాలా బాధగా అనిపించింది’’.
* ‘‘థియేటర్లో సినిమా చూస్తే దొరికే అనుభూతి.. ఓటీటీలో రాదు. కానీ, పరిస్థితుల వల్ల ఒకొక్కరూ ఒక్కో తరహా నిర్ణయాలు తీసుకుంటారు. దానిపై మరొకరు మాట్లాడటం సరికాదు. ఎన్ని ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాలొచ్చినా.. థియేటర్లు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ప్రస్తుతం నేను మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నా. తుది దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత శ్రీవాస్‌తో ఓ చిత్రం చేయనున్నా’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- IRE vs IND: ఐర్లాండ్‌పై అలవోకగా..
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!