టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథలో..

స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఈ సినిమా

Updated : 08 Aug 2021 07:09 IST

స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ కథ హీరో రవితేజ వద్దకు చేరిందని తెలిసింది. ఆయనకి  నచ్చడంతో.. సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. దీనికి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంలా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అభిషేక్‌ అగర్వాల్‌. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 70వ దశకంలో వరుస దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు. అప్పట్లో ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో కథలు కథలుగా చెప్పుకొనేవారు. రవితేజ ప్రస్తుతం ‘రామారావు’, ‘ఖిలాడీ’ సినిమాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని