భారత దేశమంత స్వచ్ఛమైన సినిమా

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో గురు పవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇదే మా కథ’. జీ మహేశ్‌ నిర్మించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది.

Updated : 07 Dec 2022 21:32 IST

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో గురు పవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇదే మా కథ’. జీ మహేశ్‌ నిర్మించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఎస్‌.రాజు, బి.గోపాల్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఓ నలుగురు వ్యక్తుల కథ ఇది. వారి లక్ష్యాలేంటి? వాటిని ఎలా చేరుకున్నారు? ఈ క్రమంలో ఒకరికొకరు ఎలా సహాయ పడ్డారు? అనేది మిగతా కథాంశం. సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది. సుమంత్‌ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుంది. లద్దాఖ్‌లో నీళ్లలో జంప్‌ చేసి, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాడు. అంత చలిలో అలా చేయడం చూసి నాకు భయమేసింది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అంతా చూపించాం. ఈ ప్రయాణంలో శ్రీకాంత్‌, భూమిక గారితో పని చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. కథను నమ్మి, ఎంతో ధైర్యంతో మహేష్‌ ఈ చిత్రాన్ని తీశార’’న్నారు హీరో సుమంత్‌ అశ్విన్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నేను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొన్న సమయంలో ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లాను. 5వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథ రాశాను. భారత దేశం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో.. మా సినిమా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కథ నమ్మి సినిమా చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంత్‌, భూమిక, సుమంత్‌, తాన్యలకు థ్యాంక్స్‌’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని