ప్రేక్షకులు వచ్చే మార్గం చూడండి

కొందరు థియేటర్‌ యజయానులు, ఫిల్మ్‌  స్టూడియోల గ్యాంగిజం, గ్రూపిజం కారణంగా సినిమా వ్యాపారానికి తీవ్ర నష్టం జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది ప్రముఖ  కథానాయిక కంగనా రనౌత్‌. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ...

Updated : 05 Sep 2021 07:21 IST

‘తలైవి’ని ఆపడం కాదు..

కొందరు థియేటర్‌ యజయానులు, ఫిల్మ్‌  స్టూడియోల గ్యాంగిజం, గ్రూపిజం కారణంగా సినిమా వ్యాపారానికి తీవ్ర నష్టం జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది ప్రముఖ  కథానాయిక కంగనా రనౌత్‌. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథలో ఆమె నటించిన చిత్రం ‘తలైవి’. ఈ నెల 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తమ సినిమా విడుదలకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంది కంగన. ఇందులో ఆమె మాట్లాడుతూ ‘‘కరోనా కారణంగా బాగా దెబ్బతిన్న పరిశ్రమల్లో సినిమా ఒకటి. థియేటర్‌ వ్యాపారం క్షీణించిపోయింది. ఓటీటీ వేదికలు లాభాలు గడించాయి. మాకూ భారీ ఆఫర్లు వచ్చాయి. థియేటర్‌ కారణంగా ఈ స్థాయికి వచ్చాం కాబట్టి వాటికి అండగా నిలవాలనే ఉద్దేశంతో విడుదలకు ముందుకొచ్చాం. కానీ ఆశించినట్టుగా థియేటర్ల నుంచి మద్దతు దక్కలేదు. కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మా సినిమాని ప్రదర్శించడానికి ముందుకు రావడం లేదు. యశ్‌రాజ్‌ లాంటి ఫిల్మ్‌ స్టూడియోలు ‘తలైవి’ని ప్రదర్శించడానికి ఒప్పుకోవడం లేదని మల్టీప్లెక్స్‌ వాళ్లు చెబుతున్నారు. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఈ గ్రూపిజం, గ్యాంగిజంలను విడిచిపెట్టి ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వచ్చే మార్గాలను ఆలోచించాలి’’అని చెప్పింది. ఈ సందర్భంగా ప్రేక్షకుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘నాకు మీ మద్దతు అవసరం. మీ నుంచి అది లభిస్తుందని నాకు తెలుసు. మల్టీప్లెక్సులు మా చిత్రాన్ని ప్రదర్శించకపోతే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనే చూడండి. ఆ తర్వాత ఓటీటీ వేదికల్లో చూడండి’’అని కోరింది కంగన. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహించిన ‘తలైవి’ చిత్రంలో ఎమ్‌జీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించారు.


‘అమ్మ’కు నివాళుర్పించిన ‘తలైవి’

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘తలైవి’ చిత్ర ప్రచారంలో భాగంగా శనివారం  చెన్నై వచ్చిన కంగనా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు చేరుకొని అంజలి ఘటించారు. ఎంజీఆర్‌, కరుణానిధి సమాధులనూ ఆమె సందర్శించారు. ఆమెతో పాటు చిత్ర దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ఉన్నాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని