భావోద్వేగాల ప్రయాణం మహా సముద్రం

తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో మా ‘మహా సముద్రం’ తెరకెక్కిందన్నారు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటించారు. అను ఇమ్మానుయేల్‌,   అదితిరావు హైదరీ కథానాయిక.

Updated : 24 Sep 2021 06:57 IST

తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో మా ‘మహా సముద్రం’ తెరకెక్కిందన్నారు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటించారు. అను ఇమ్మానుయేల్‌,   అదితిరావు హైదరీ కథానాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘భావోద్వేగాల ప్రయాణం ఈ సినిమా. ఓపెన్‌ డ్రామాతో కూడిన ఓ ప్రేమకథ. యాక్షన్‌ సమ్మేళనంగా రూపొందింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు... ఇలా ప్రతిదీ పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మంచి సంగీతం, మంచి కెమెరా పనితనం కనిపిస్తుంది. విశాఖ చరిత్రలో ఎక్కువ రోజులు చిత్రీకరించిన సినిమా ఇదే. ఇందులోని ప్రతి పాత్ర మన చుట్టూ కనిపించే పాత్రల్లాగే ఉంటాయి. నేను చేసిన ‘ఆర్‌.ఎక్స్‌.100’ గురించి దేశం మొత్తం తెలుసు. అంతకుమించి ఉంటుందీ చిత్రం. ఇద్దరు హీరోల్ని సెట్‌ చేయడం కష్టమైంది. చాలా క్లిష్టమైన పాత్రలు ఇందులో ఉంటాయి. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, నిర్మాత అనిల్‌ సుంకర ఇచ్చిన సహకారంతో నేను స్వేచ్ఛగా సినిమా తీయగలిగా. నా దృష్టిలో ‘మహాసముద్రం’ బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించినట్టే’’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ప్రేమలో హింస ఉంటుంది. ట్రైలర్‌లో యాక్షన్‌ కనిపిస్తున్నా... అందరికీ నచ్చే భావోద్వేగాలు ఇందులో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రం అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో అను ఇమ్మానుయేల్‌, సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రాహకుడు రాజ్‌ తోట పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు