నవ్వులు పంచే ‘గల్లీ రౌడీ’

‘‘నేను వాడ్ని కొట్టే దెబ్బలు చాలా వైలెంట్‌గా ఉంటాయి. కళ్లు తిరిగి పడిపోతావు. లోపలికెళ్లు’’ అంటూ నాయిక నేహా శెట్టికి సలహా ఇస్తున్నాడు హీరో సందీప్‌ కిషన్‌. ఇప్పుడీ ఇద్దరూ జంటగా నటించిన

Updated : 13 Sep 2021 07:27 IST

‘‘నేను వాడ్ని కొట్టే దెబ్బలు చాలా వైలెంట్‌గా ఉంటాయి. కళ్లు తిరిగి పడిపోతావు. లోపలికెళ్లు’’ అంటూ నాయిక నేహా శెట్టికి సలహా ఇస్తున్నాడు హీరో సందీప్‌ కిషన్‌. ఇప్పుడీ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఆదివారం అగ్రహీరో చిరంజీవి ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే చిత్రమిది. వంశపారంపర్యంగా వచ్చిన రౌడీయిజాన్ని భుజానికెత్తుకున్న గల్లీ రౌడీగా సందీప్‌ కనిపించనున్నారు. ట్రైలర్‌ను బట్టి.. సినిమాలో వినోదానికి, యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు  అర్థమవుతోంది. బాబీ సింహా పోలీస్‌ అధికారిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్‌ నాయిక తండ్రిగా అతి భయస్తుడి పాత్రలో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి చౌరస్తా రామ్‌, సాయి కార్తీక్‌ స్వరాలందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని