Updated : 06/10/2021 07:11 IST

Miles of Love: ప్రేమ ప్రయాణం

భినవ్‌ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా నటించిన చిత్రం ‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’. రాజిరెడ్డి నిర్మాత. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ స్వరకర్త. ఈ సినిమా టీజర్‌ని కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘కొత్తవాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. అభినవ్‌ చాలా అందంగా కనిపించారు. త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు. ‘‘నిజాయతీగా చేసిన ఓ స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. ఓ జంట చేసిన ఈ ప్రేమప్రయాణంలో భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయి. సంభాషణలకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన ఈ సినిమాకి సంగీతం ప్రధానబలం. సిద్‌శ్రీరామ్‌ ఆలపించిన  ‘తెలియదే తెలియదే...’ పాటకి చక్కటి స్పందన లభించింద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని