అన్నాచెల్లెళ్ల కథ

నవీన్‌చంద్ర, అవికాగోర్‌ అన్నా చెల్లెళ్లుగా నటించిన చిత్రం ‘బ్రో’. సంజనసారథి, సాయి రోనక్‌ ప్రధాన పాత్రధారులు. కార్తీక్‌ తుపురాణి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 09 Aug 2021 09:26 IST

వీన్‌చంద్ర, అవికాగోర్‌ అన్నా చెల్లెళ్లుగా నటించిన చిత్రం ‘బ్రో’. సంజనసారథి, సాయి రోనక్‌ ప్రధాన పాత్రధారులు. కార్తీక్‌ తుపురాణి దర్శకత్వం వహిస్తున్నారు. జె.జె.ఆర్‌.రవిచంద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా లుక్‌ని కథానాయిక రష్మిక మందన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో సాగే ఓ ఫాంటసీ చిత్రమిది. భావోద్వేగాలకి ప్రాధాన్యం ఉంది. బలమైన కథ, పాత్రలు కావడంతో... నవీన్‌చంద్ర, అవికాగోర్‌ అన్నాచెల్లెళ్లుగా నటించారు. విశాఖతోపాటు పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఛాయాగ్రహణం: అజీమ్‌ మహ్మద్‌, సంగీతం: శేఖర్‌చంద్ర, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని