‘భవదీయుడు భగత్‌సింగ్‌’గా..

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ

Updated : 10 Sep 2021 07:56 IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా  ప్రకటించింది. దీంతో పాటు ‘‘పవర్‌ఫుల్‌ టైటిల్‌ ఫర్‌ పవర్‌ఫుల్‌ కటౌట్‌’’ అంటూ పవన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌నూ విడుదల చేశారు. పవన్‌ ఇండియా గేట్‌ ముందు హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై స్టైలిష్‌గా కూర్చుని కనిపించారు. ఓ చేతిలో టీ గ్లాస్‌.. మరో చేతిలో స్పీకర్‌ పట్టుకుని ఉన్నారు. ప్రచార చిత్రంపై ‘ఇట్స్‌ నాట్‌ జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని పేర్కొనడాన్ని బట్టి.. ఈసారి వినోదంతో పాటు ఓ చక్కటి సందేశాన్ని అందించనున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కూర్పు: చోటా కె ప్రసాద్‌, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: అయనాంక బోస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని