దసరాకి పెళ్లి సందడి

దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు శ్రీకాంత్‌ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘పెళ్లి సందడి’. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా మరో ‘పెళ్లి సందదీ’ని తీసుకొస్తున్నారు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నారు

Updated : 22 Sep 2021 07:08 IST

దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు శ్రీకాంత్‌ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘పెళ్లి సందడి’. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా మరో ‘పెళ్లి సందదీ’ని తీసుకొస్తున్నారు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ చిత్రమిది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ అందుకున్నాం. దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. బుధవారం మహేష్‌బాబు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నాం’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు