హైదరాబాద్‌లో రామ్‌ చిత్రం

రామ్‌ కథానాయకుడిగా..లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి, అక్షర గౌడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా

Updated : 08 Aug 2021 07:12 IST

రామ్‌ కథానాయకుడిగా..లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి, అక్షర గౌడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో రామ్‌ - ఆది పినిశెట్టిల మధ్య పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. కొండారెడ్డి బురుజు నేపథ్యంలో సాగే సన్నివేశాలవి. రామ్‌ ఇందులో పోలీస్‌గా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని