చరణ్‌ - శంకర్‌ చిత్రం ప్రారంభం

ఈ ఏడాది దక్షిణాదిలో ఆసక్తికరమైన కలయికలతో కూడిన పలు సినిమాలు పట్టాలెక్కాయి. అందులో రామ్‌చరణ్‌ - శంకర్‌ చిత్రం ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న 50వ చిత్రమిది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌చంద్ర, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

Updated : 09 Sep 2021 07:24 IST

ఏడాది దక్షిణాదిలో ఆసక్తికరమైన కలయికలతో కూడిన పలు సినిమాలు పట్టాలెక్కాయి. అందులో రామ్‌చరణ్‌ - శంకర్‌ చిత్రం ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న 50వ చిత్రమిది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌చంద్ర, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా. బాలీవుడ్‌ తార రణ్‌వీర్‌సింగ్‌, అగ్ర కథానాయకుడు చిరంజీవి, అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, రణ్‌వీర్‌ సింగ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. బలమైన సామాజికాంశాలతో శంకర్‌ మార్క్‌ సినిమాగా రూపొందుతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్స్‌: రామకృష్ణ - మోనిక, రచన: సాయిమాధవ్‌ బుర్రా, సు.వెంకటేశన్‌ - వివేక్‌ (తమిళం), పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌, వివేక్‌ (తమిళం).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని