కళాశాలలో ‘రౌడీబాయ్స్‌’

రెండు కళాశాలలు... ఇంజినీరింగ్‌ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమే మా ‘రౌడీబాయ్స్‌’ అంటున్నారు నిర్మాత దిల్‌రాజు.

Updated : 04 Sep 2021 07:41 IST

రెండు కళాశాలలు... ఇంజినీరింగ్‌ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమే మా ‘రౌడీబాయ్స్‌’ అంటున్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన శిరీష్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌ గీతాన్ని శుక్రవారం విశాఖలోని విజ్ఞాన్‌ కళాశాల విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘పాతికేళ్ల ముందు యువతరాన్ని ‘ప్రేమదేశం’ షేక్‌ చేసింది. తర్వాత ‘హ్యాపీడేస్‌’ చూశాం. యువతరం నేపథ్యంలో సాగే సినిమా ఈమధ్య రాలేదని ‘రౌడీబాయ్స్‌’ చేశాం. చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తామ’’న్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని