
Updated : 14 Aug 2021 07:00 IST
ఇందుమూలంగా తెలియజేయడమేమనగా
మొన్న విడుదలైన ‘సర్కారు వారి పాట’ ప్రచార చిత్రంలో ‘ఇందుమూలంగా తెలియజేయడమేమనగా...’ అంటూ మహేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అదే తరహాలో ఇప్పుడు మరో రౌండ్ ప్రతినాయకుల పని పడుతున్నాడు. శుక్రవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఓ భారీ సెట్ వేసి, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. కొంత టాకీ భాగమూ అక్కడే చిత్రీకరిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. పరశురామ్ దర్శకత్వలో మహేష్, కీర్తి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
Advertisement
Tags :