ప్రశంసలతో... కష్టాన్ని మర్చిపోయాం

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్‌ దర్శకుడు. జీ మహేష్‌ నిర్మించారు.

Updated : 07 Dec 2022 17:35 IST

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్‌ దర్శకుడు. జీ మహేష్‌ నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం చిత్ర బృందం   విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత నాకు మంచి విజయం దక్కింది. దర్శకుడు చిత్రాన్ని ఎంతో బాగా తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకుంటున్నారు’’ అన్నారు. ‘‘దాదాపు రెండేళ్లు కష్టపడి చేసిన చిత్రమిది. దీన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా? అని చాలా టెన్షన్‌ పడ్డాం. ఇప్పుడు వాళ్ల ప్రశంసలతో మా రెండేళ్ల కష్టాన్ని మర్చిపోయామ’’న్నారు సుమంత్‌ అశ్విన్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజుల నుంచి థియేటర్లకు దూరంగా ఉన్న మహిళల్ని థియేటర్లకు రప్పించాలని ప్రయత్నం చేశాం. అందులో సక్సెస్‌ అయ్యాం. ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కుతోంద’’న్నారు. ‘‘మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని