సూపర్‌ ‘హను-మాన్‌’

ఒరిజినల్‌ ఇండియాన్‌ సూపర్‌ హీరో చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘హను - మాన్‌’ పేరుతో ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది.

Updated : 19 Sep 2021 07:27 IST

రిజినల్‌ ఇండియాన్‌ సూపర్‌ హీరో చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘హను - మాన్‌’ పేరుతో ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. తేజ సజ్జా కథానాయకుడు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, కథానాయకుడిని పరిచయం చేస్తూ తీర్చిదిద్దిన వీడియోని ప్రముఖ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అంజనాద్రి అనే ఓ కొత్త ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారని సినీ వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని