Updated : 12 Aug 2021 08:04 IST

ఆర్యపై మహిళ ఫిర్యాదు

సైబర్‌క్రైం ఎదుట హాజరు

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించాడని శ్రీలంక యువతి నటుడు ఆర్యపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు   విషయమై నటుడు  ఆర్య మంగళవారం రాత్రి సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఆర్య 2019లో నటి సాయేషాను వివాహమాడారు. వీళ్లకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. ఇదిలా ఉండగా.. జర్మనీలో ఉంటున్న శ్రీలంకకు చెందిన యువతి విద్జా.. నటుడు ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించినట్లు జర్మని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే భారత రాష్ట్రపతి, ప్రధానులకూ లేఖరాసింది. దీంతో నటుడు ఆర్యకు చెన్నైలోని సైబర్‌క్రైం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆ ప్రకారం మంగళవారం రాత్రి ఆర్య సైబర్‌క్రైం  ఇన్‌స్పెక్టర్‌ గీత ఎదుట హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు    విచారణ జరిగింది. విచారణ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు ఆర్య. కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు ఈనెల 17న మళ్లీ విచారణకు రానుంది.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని