కేజీఎఫ్‌-2 ఎప్పుడంటే?

పాన్‌ఇండియా స్థాయిలో క్రేజ్‌ ఏర్పడిన చిత్రం ‘కేజీఎఫ్‌-చాప్టర్‌1’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టి విజయఢంకా మోగించింది.

Updated : 23 Aug 2021 07:36 IST

పాన్‌ఇండియా స్థాయిలో క్రేజ్‌ ఏర్పడిన చిత్రం ‘కేజీఎఫ్‌-చాప్టర్‌1’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టి విజయఢంకా మోగించింది. దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’ రూపొందిన విషయం తెలిసిందే. దీన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ‘కేజీఎఫ్‌-  చాప్టర్‌2’ని ఏప్రిల్‌ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ప్రకటించింది. సంజయ్‌దత్‌,  రవీనాటాండన్‌, రావూ రమేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవి బస్‌రుర్‌ కాగా, ఛాయాగ్రహణం భువన్‌ గౌడ.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని