తప్పుకొన్న బండ్ల గణేశ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొన్నారు నటుడు బండ్ల గణేశ్‌. ఆ మేరకు తన నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. నా దైవ సమానులు, నా ఆత్మీయులు,...

Updated : 02 Oct 2021 07:23 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొన్నారు నటుడు బండ్ల గణేశ్‌. ఆ మేరకు తన నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన  శుక్రవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు. బండ్ల మొదట  ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విభేదాలతో బయటికొచ్చారు. స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేశారు.


పెద్దలు జోక్యం చేసుకోవాలి

చిత్ర పరిశ్రమలో  వివాదాలు సద్దుమణిగేలా సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరారు నిర్మాత నట్టికుమార్‌. ఎవరు ఎలాంటి గొడవలు పడినా అందులోకి కుటుంబాల్ని లాగడం, అలాగే  అభిమానులు ఇళ్లపై దాడులు చేయడం సరికాదని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నట్టికుమార్‌ మాట్లాడారు. కొద్దిమంది నిర్మాతల ద్వంద్వ విధానాలే పవన్‌కల్యాణ్‌, పోసానిల మధ్య వివాదానికి కారణమైందన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం మంచిదే అని, దాని  నిర్వహణ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని