షారుక్‌... సంజూ భాయ్‌ కలిస్తే!

కొన్ని కలయికలు సినిమాపై అంచనాలు పెంచుతాయి. వెండితెరపై బలంగా తమ ప్రభావాన్ని చూపించే ఇద్దరు వ్యక్తులు ఒకే సినిమాలో  నటిస్తుంటే ఆ క్రేజే వేరుగా....

Updated : 15 Jul 2021 10:11 IST

ముంబయి: కొన్ని కలయికలు సినిమాపై అంచనాలు పెంచుతాయి. వెండితెరపై బలంగా తమ ప్రభావాన్ని చూపించే ఇద్దరు వ్యక్తులు ఒకే సినిమాలో  నటిస్తుంటే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. త్వరలో బాలీవుడ్‌లో అలాంటి ఓ కలయికను ప్రేక్షకులు చూడబోతున్నారు. అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్, ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘రాఖీ’ అనే పేరుని అనుకుంటున్నట్టు సమాచారం. దర్శకుడు, నిర్మాతలు  ఎవరనేది కొన్ని రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. గతంలో షారుఖ్‌ చిత్రం ‘రా వన్‌’ ప్రారంభ సన్నివేశంలో తళుక్కున మెరిశారు సంజయ్‌. ఆ తర్వాత సంజయ్‌ ‘ఓం శాంతి ఓం’లో షారుఖ్‌తో కలిసి ఓ పాటలో కాలు కదిపారు. తెర వెనుక షారుక్, సంజయ్‌ మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ పూర్తిస్థాయి చిత్రంలో నటిస్తుంటే అభిమానులకు చూడముచ్చటగానే ఉంటుందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని