
కురిసెనంట మురిపాల వాన...
మధురా నగరిలో యమునా తటిలో... మురళీ స్వరములే ముసిరిన ఎదలో... కురిసెనంట మురిపాల వాన... అంటూ పాడుకుంటోంది ఓ ప్రేమజంట. ఆ కథేమిటో తెలియాలంటే ‘పెళ్లిసందడి’ చూడాల్సిందే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణంలో రోషన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన చిత్రమిది. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈచిత్రంలోని ‘యమునా నగరిలో..’ అంటూ సాగే పాటని ప్రముఖ కథానాయకుడు రవితేజ విడుదల చేశారు. ‘‘మధురా నగరిలో... లిరికల్ గీతం ఆకట్టుకొంటోంది. చంద్రబోస్ రచించిన ఈ గీతానికి ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలందించగా, శ్రీనిధి, నయనా నాయర్, కాలభైరవ ఆలపించార’’ని చిత్ర వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.