Doctor: డాక్టర్‌ మెప్పిస్తాడు

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. కోటపాడి జె.రాజేష్‌ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. సునీల్‌ నారంగ్‌, సుధాకర్‌రెడ్డి, ఠాగూర్‌ మధు ముఖ్య అతిథులుగా

Updated : 08 Oct 2021 07:21 IST

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. కోటపాడి జె.రాజేష్‌ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. సునీల్‌ నారంగ్‌, సుధాకర్‌రెడ్డి, ఠాగూర్‌ మధు ముఖ్య అతిథులుగా హాజరై బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించారు. కథానాయకుడు శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ ‘‘థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు నాలో ఉత్సాహాన్ని పెంచుతుంటాయి. రెండేళ్లుగా వాటిని మిస్‌ అవుతున్నా. హైదరాబాద్‌లో ప్రేక్షకుల సందడి చాలా సంతోషాన్నిచ్చింది. ఇందులో డాక్టర్‌గా కనిపిస్తా. ‘రెమో’లో నేను నర్స్‌ పాత్రలో ప్రేమిస్తుంటా. ఇందులోనేమో డాక్టర్‌గా విభిన్నమైన ఆపరేషన్స్‌ చేస్తుంటా. సినిమా చూసినప్పుడు కొత్తగా అనిపించింది. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. సినిమాకి ఎల్లలు లేవు. ‘వరుణ్‌ డాక్టర్‌’ తెలుగు ప్రేక్షకుల్ని తప్పక మెప్పిస్తాడు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా డాక్టర్‌ మంచోడా చెడ్డోడా అనే ప్రశ్నలకి 9న సమాధానం లభిస్తుంది. సినిమాలో వినోదంతో పాటు, ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ఇది కొత్తతరం సినిమా అని చెప్పింది ప్రియాంకా అరుల్‌మోహన్‌. చిత్రాన్ని విడుదల చేస్తున్న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మహేశ్వర్‌రెడ్డితోపాటు ఇతర చిత్రబృందం ఈ కార్య క్రమంలో పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని