Family Drama: ఓటీటీలో ‘ఫ్యామిలీడ్రామా’

సుహాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహించారు. తేజా కాసరపు, మెహర్‌తేజ్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 30 Aug 2022 15:44 IST

సుహాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహించారు. తేజా కాసరపు, మెహర్‌తేజ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ నెల 29న విడుదల కానుంది. గురువారం   ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానాయకుడు సుహాస్‌ హత్యలు చేసే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘‘ప్రతి చిన్న విషయానికి తండ్రి తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి... తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటికి వచ్చేసిన ఓ అమ్మాయి... ఈ ఇద్దరూ ఎలా కలిశారు? వాళ్లకి సుహాస్‌ ఎలా సాయం చేశాడనేదే ఈ కథ’’ అని సినీ వర్గాలు తెలిపాయి. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతిమెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని