Surya: ‘వాడివాసల్‌’ సన్నాహాలు

ఇటీవలే ‘ఈటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయకుడు సూర్య. ఇప్పుడాయన ‘వాడివాసల్‌’ కోసం రంగంలోకి దిగారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. సిఎస్‌.చెలప్ప రాసిన ‘వాడివాసల్‌’ అనే నవల ఆధారంగా రూపొందుతోంది.

Updated : 21 Mar 2022 12:34 IST

ఇటీవలే ‘ఈటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయకుడు సూర్య. ఇప్పుడాయన ‘వాడివాసల్‌’ కోసం రంగంలోకి దిగారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. సిఎస్‌.చెలప్ప రాసిన ‘వాడివాసల్‌’ అనే నవల ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమా టెస్ట్‌ షూట్‌ చెన్నైలోని ఈసీఆర్‌లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా సూర్యపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. జల్లికట్టు ఆట చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. జులై నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని