విరామం తర్వాతే...

కొంచెం విరామం కావాలంటోంది కథానాయిక సమంత. సినిమాలు... వెబ్‌సిరీస్‌తో తీరిక లేకుండా గడుపుతున్న ఆమె ఇటీవలి కాలంలో కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. ‘శాకుంతలం’తోపాటు తమిళంలో చేస్తున్న సినిమానీ

Updated : 27 Aug 2021 08:23 IST

కొంచెం విరామం కావాలంటోంది కథానాయిక సమంత. సినిమాలు... వెబ్‌సిరీస్‌తో తీరిక లేకుండా గడుపుతున్న ఆమె ఇటీవలి కాలంలో కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. ‘శాకుంతలం’తోపాటు తమిళంలో చేస్తున్న సినిమానీ పూర్తి చేసింది. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌ సినిమాల విషయంలో ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ సమంత మాత్రం ‘నటులకి అప్పుడప్పుడు విరామం చాలా అవసరం అని... ఈ 11 ఏళ్లలో ఎప్పుడూ విరామం తీసుకోలేదని, సెలవులు గడిపాకే కొత్త చిత్రాల గురించి ఆలోచిస్తాన’ని చెబుతోంది. ‘ఫ్యామిలీమేన్‌ 2’లో ఆమె నటనకి ప్రేక్షకుల ప్రశంసలే కాదు, పురస్కారాలు కూడా దక్కుతున్నాయి. ఆ ఆనందాన్ని ఇటీవల బాలీవుడ్‌ మీడియా సంస్థలతో పంచుకుంది సమంత. ఈ 11 యేళ్ల కెరీర్‌లో నటిగానే కాకుండా... వ్యక్తిగా ఎంతో ఎదిగానని చెప్పుకొచ్చింది సమంత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని