The Ghost: ఎడారిలో యాక్షన్‌

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌

Updated : 16 Mar 2022 13:37 IST

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. దుబాయ్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇప్పుడీ షెడ్యూల్‌లో భాగంగా నాగ్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిత్ర దర్శకుడు. ఆ ఫొటోల్లో నాగ్‌ రేసింగ్‌ బైక్‌తో  ఛేజింగ్‌కు సిద్ధమవుతున్నట్లుగా కనిపించారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఈ సీక్వెన్స్‌ను అక్కడి ఏడారిలో చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. ‘‘థ్రిల్లింగ్‌ అంశాలతో ఒక మంచి యాక్షన్‌ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం. నాగార్జున శక్తిమంతమైన అవతారంలో కనిపిస్తారు. ఆయన లుక్‌ చాలా కొత్తగా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు, నభా, కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: ముఖేష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని