ఈ చిన్నారే, ఆ సూపర్‌ స్టార్‌: ఎవరంటే..

వచ్చే నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న ఓ సూపర్‌ స్టార్‌.. మరి ఆయనెవరో కనిపెట్టగలరా..

Updated : 15 Sep 2020 09:58 IST

వచ్చే నెలలోనే ఆయన జన్మదినం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత పెద్ద సినీ స్టార్లకైనా వ్యక్తిగత, కుటుంబ జీవితం అంటూ ఉంటుంది. మరి అందుకు సంబంధించిన విషయాలు, విశేషాల పట్ల అభిమానులకు అమితాసక్తిగా ఉండటమూ మామూలే. దీనికి అనుగుణంగా సినీతారలు తమ చిత్రాలను, విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. కాగా, వచ్చే నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న ఓ సూపర్‌ స్టార్‌.. బోసినవ్వులు చిందిస్తున్న తన చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

ఆలోచనలు రేకెత్తించే పోస్టులతో అభిమానులను అలరించే అమితాబ్‌ బచ్చన్‌.. తన పాత చిత్రాలను షేర్‌ చేయటం అరుదనే చెప్పాలి. కాగా ఇటీవల ఆయన పంచుకున్న త్రోబ్యాక్‌ చిత్రాలు అభిమానుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్‌ 11న తన 78వ పుట్టినరోజు జరుపుకోనున్న ‘బిగ్‌ బీ’.. తన జీవిత పుటల్లో వెనక్కు వెళ్లి మరీ తను చిన్నారిగా ఉన్నప్పటి ఓ అపురూప చిత్రాన్ని తన అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ఇందుకు నెటిజన్లు ‘‘సో క్యూట్.. ఇప్పటికీ యంగ్, డైనమిక్‌, ఎవర్‌ గ్రీన్‌..’’ అంటూ మురిసిపోతున్నారు.
కాగా, ఈ బాలీవుడ్‌ ‘బాద్‌షా’ వెండితెరపై చివరిగా ‘గులాబో సితాబో’ చిత్రంలో సందడి చేశారు. ప్రస్తుతం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి..’ సీజన్ 12 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని