#SBSB షూటింగ్‌ పూర్తి.. ‘గమనం’లో శ్రియ..!

హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన తదుపరి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ షూటింగ్‌ను శుక్రవారం పూర్తి...

Published : 11 Sep 2020 23:50 IST

నేటి సినీ సంగతులు

హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన తదుపరి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ షూటింగ్‌ను శుక్రవారం పూర్తి చేసుకున్నారు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా నభా నటేశ్‌ సందడి చేయనున్నారు.

*‘సోలోబ్రతుకే సో బెటర్‌’ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలతో ప్రేక్షకులను మెప్పించిన తమన్‌ త్వరలోనే ఈ చిత్రం నుంచి మూడో పాటతో అలరిస్తానని చెప్పారు.

*శ్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘గమనం’. సుజనారావు రూపొందిస్తున్నారు. శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు క్రిష్‌ చేతుల మీదుగా చిత్రబృందం విడుదల చేసింది.

*నివేదా థామస్‌, సుధీర్‌బాబు కలిసి నటించిన చిత్రం ‘వి’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలయ్యింది. దర్శకుడు మోహన్‌కృష్ణ, సినిమాటోగ్రాఫర్‌ పి.జి.విందాతో దిగిన ఓ ఫొటోను ఆమె తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

*విజయ్‌ సేతుపతి, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా కనిపించనున్న చిత్రం ‘కాపే రణసింగం’. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు విజయ్‌ సేతుపతి తెలిపారు. జీఫ్లిక్స్‌ వేదికగా ఐదు భారతీయ భాషల్లో ఈసినిమా విడుదల కానుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని