
Cinema news: రామ్‌కి గాయం
కథానాయకుడు రామ్‌కి స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని ఆయనే ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. ఇందు కోసమే జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తుండగా.. ఆయన మెడకు స్వల్ప గాయమైనట్లు తెలిసింది. మెడకు సర్వికల్ నెక్ పిల్లో చుట్టుకుని ఉన్న ఓ ఫొటోను రామ్ ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీనికి ‘‘టేక్ ఎ బ్రేక్..’’ అంటూ ఓ వ్యాఖ్యను కూడా జత చేశారు. ప్రస్తుతం ఆయన గాయాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలిపింది. ఆయన పూర్తిగా కోలుకోగానే చిత్రీకరణ తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పింది. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రామ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఆయన సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తుండగా.. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.