Pawankalyan: మరో రీమేక్‌ కోసం...?

పవన్‌కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ కలిసి మరో సినిమా చేయబోతున్నారా? ఈసారి కూడా ‘భీమ్లానాయక్‌’ తరహాలోనే తెరకెక్కనున్న మరో రీమేక్‌ కోసం త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం

Updated : 06 Mar 2022 20:57 IST

వన్‌కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ కలిసి మరో సినిమా చేయబోతున్నారా? ఈసారి కూడా ‘భీమ్లానాయక్‌’ తరహాలోనే తెరకెక్కనున్న మరో రీమేక్‌ కోసం త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం అవుననే వినిపిస్తున్నాయి తెలుగు సినీ    పరిశ్రమ వర్గాలు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదయ చిత్తం’ సినిమా తెలుగులో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రీమేక్‌ కానుందని సమాచారం. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాని మాతృకలో తెరకెక్కించిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తున్నట్టు తెలిసింది. క్రిష్‌ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’తోపాటే ఈ సినిమాని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పవన్‌కల్యాణ్‌తోపాటు ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ కూడా నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని