థియేటర్లు తెరవండి.. ఉద్యోగాలు కాపాడండి

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా బాగా నష్టపోయిన రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. అన్‌లాక్‌లో భాగంగా షాపింగ్‌ మాల్స్, విమాన సర్వీసులు,

Published : 16 Sep 2020 12:15 IST

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా బాగా నష్టపోయిన రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. అన్‌లాక్‌లో భాగంగా షాపింగ్‌ మాల్స్, విమాన సర్వీసులు, రైల్వేలు, బస్సులు, మెట్రో, హోటళ్లు, జిమ్‌లు ఇలా చాలా రంగాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లను త్వరగా తెరిచేలా చూడాలంటూ దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల నుంచి వినతులు వస్తున్నాయి. ‘అన్‌లాక్‌ సినిమాస్‌.. సేవ్‌జాబ్స్‌’ పేరుతో ఇన్‌స్టాలో మొదలైన్‌ హ్యాష్‌ట్యాగ్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ ఆరు నెలల లాక్‌డౌన్‌తో భారతీయ చిత్ర పరిశ్రమ నెలకు సుమారు రూ.1500 కోట్ల చొప్పున రూ.9000 కోట్లు నష్టపోయినట్టు ఇందులో ప్రస్తావించారు. ‘దేశవ్యాప్తంగా 10000 స్క్రీన్లు మూసేయడం వలన ప్రత్యక్షంగా రెండు లక్షల మంది, పరోక్షంగా ఎన్నో లక్షలమంది ఉపాధి కోల్పోయారు. 

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని థియేటర్లను తెరిస్తే చాలామంచిది. ఇప్పటికే చైనా, కొరియా, యూకే, ఇటలీ, యూఎఈ, యూఎస్‌ఏ, సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాల్లో జాగ్రత్తలు తీసుకొని థియేటర్లను తెరిచారు. అక్కడ వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం, థియేటర్లు తెరుచుకోకపోవడంతో సినిమా రంగంపై ఆధారపడిన చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. అందుకే ప్రభుత్వం త్వరగా థియేటర్లను తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాం’’ అని ఆ హ్యాష్‌ ట్యాగ్‌లో రాశారు. దీనిపై ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత స్పందించారు. ‘‘థియేటర్లను త్వరగా తెరవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సినిమాపై ఆధారపడిన వారి ఉద్యోగాలు, ఉపాధికి సంబంధించిన విషయమిది’’అంటూ నమ్రత ఏఎమ్‌బీ సినిమాస్‌ పెట్టిన పోస్ట్‌ను రీ పోస్ట్‌ చేసి స్పందించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని