Published : 19 Oct 2020 02:17 IST

వరలక్ష్మి కొత్త అవతారం.. సెలబ్రిటీల ట్వీట్లు

చెన్నై: చిత్ర పరిశ్రమకు మరో కొత్త దర్శకురాలు పరిచయం కాబోతున్నారు. ఇన్నాళ్లూ నటిగా ప్రేక్షకుల్ని అలరించిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దర్శకురాలి అవతారం ఎత్తారు. ‘కన్నామూచి’ అనే టైటిల్‌ను ఆమె సినిమాను ఖరారు చేశారు. ఎన్‌.రామస్వామి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వరలక్ష్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం విడుదల చేసిన ‘కన్నామూచి’ ఫస్ట్‌లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సహ నటికి మద్దతు తెలుపుతూ.. సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు.

‘ఉమెన్‌ పవర్‌’ అంటూ.. సమంత, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి, కాజల్‌, త్రిష, తమన్నా, ఐశ్వర్య రాజేష్‌, తాప్సి, మంచు లక్ష్మి, శ్రుతి హాసన్‌, సాయేషా సైగల్‌, రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్‌, అదితి రావు హైదరి, హన్సిక, అక్షరా హాసన్‌, రాయ్‌ లక్ష్మి, ఆండ్రియా, మాంజిమా మోహన్‌, సుహాసిని, సిమ్రన్‌, చిన్మయి.. తదితరులు ట్వీట్లు చేయడం విశేషం. వీరందరికీ వరలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. సందీప్‌ కిషన్‌, విఘ్నేశ్‌ శివన్‌, అడివి శేషు‌, జయం రవి తదితరులు వరలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకురాలిగా ఆమె పేరును చూడటం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. సూర్య సతీమణి జ్యోతిక, విజయ్‌ సతీమణి సంగీత కూడా శుభాకాంక్షలు తెలిపారు.

వరలక్ష్మి కథానాయికగానే కాకుండా సహాయ నటిగా, ప్రతినాయకురాలిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్‌’ ద్వారా తెలుగు వారిని పలకరించారు. ఆమె టాలీవుడ్‌లో నేరుగా నటించిన మొదటి సినిమా అది. అగ్ర కథానాయకుడు రవితేజ నటిస్తున్న ‘క్రాక్‌’లో వరలక్ష్మి నటిస్తున్నారు. అదే విధంగా ‘నాంది’లోనూ కనిపించనున్నారు. ఇవికాకుండా ఆమె చేతిలో ప్రస్తుతం పలు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని