‘క్రాక్‌’: అదిరిపోయే ఈ యాక్షన్‌ సీన్‌ మీకోసం..!

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది జనవరి 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది.

Updated : 07 Dec 2022 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. రవితేజ - సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా కఠారికృష్ణను వీర శంకర్‌ అరెస్టు చేసే సీన్‌ మాస్‌తో విజిల్స్‌ వేయించింది. తాజాగా ఆ సన్నివేశాన్ని ప్రముఖ ఓటీటీ ఆహా అభిమానులతో పంచుకుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ మీకోసం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని