Venkatesh: ‘నారప్ప’.. వస్తున్నారప్ప

వెంకటేష్‌ కథా నాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక.

Updated : 16 Jun 2021 08:42 IST

వెంకటేష్‌ కథా నాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. కార్తిక్‌ రత్నం, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు నిర్మాణాంతర పనులు ముగించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ‘‘తమిళంలో విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. వెంకటేష్‌ రెండు విభిన్నమైన అవతారాలలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తారు. ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి గుర్తుండిపోయే పాత్ర చేస్తోంది. తాజాగా నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. వారం రోజుల్లో తొలి కాపీ రెడీ అవుతుంది. త్వరలో కొత్తవిడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం’’ అన్నాయి చిత్ర నిర్మాతలు. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని