Venkatesh: రానాతో కలిసి వెంకీమామ వెబ్‌సిరీస్.. నేపథ్యం ఏంటి?
వెంకటేష్ ఓటీటీ వేదికల వైపు అడుగులు వేస్తున్నారా? ఓ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల్నీ పలకరించనున్నారా? అవుననే సమాధానమిచ్చారు నిర్మాత సురేష్‌బాబు. ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన..
వెంకటేష్ ఓటీటీ వేదికల వైపు అడుగులు వేస్తున్నారా? ఓ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల్నీ పలకరించనున్నారా? అవుననే సమాధానమిచ్చారు నిర్మాత సురేష్‌బాబు. ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ విషయమై పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. వెంకీ త్వరలో నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ హిందీ వెబ్‌సిరీస్ చేయనున్నారని స్పష్టత ఇచ్చారు. ఇందులో ఆయనతో పాటు రానా కూడా కలిసి నటిస్తారని వెల్లడించారు. చాలా విభిన్నమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందనుందని, వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పారు. దీన్ని హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందా? యాక్షన్ కోణంలో సాగుతుందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు. వెంకటేష్ ప్రస్తుతం ‘దృశ్యం 2’, ‘ఎఫ్ 3’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM