Vijay Deverakonda: రూ.200కోట్ల ఆఫర్‌!

భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని సమాచారం. అయితే తుది నిర్ణయంపై వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Updated : 22 Jun 2021 07:58 IST

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ల ‘లైగర్‌’ చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందా? పరిస్థితుల్ని బట్టి ఈ సినిమా ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశముందా? అవుననే అంటున్నాయి చిత్ర సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్‌, థియేట్రికల్‌.. ఐదు భాషలకు సంబంధించిన అన్ని హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతోంది. రూ.200కోట్ల భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని సమాచారం. అయితే దీనిపై విజయ్‌ భిన్నంగా స్పందించారు. ‘చాలా తక్కువ. థియేటర్‌లలో ఇంత కన్నా ఎక్కువ చూస్తారు’ అంటూ ట్వీట్‌ చేశారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే పరిస్థితులుంటే..ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకెళ్లాలని ప్రణాళిక రచిస్తున్నారు. లేదంటే.. థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఏదైనా వచ్చే నెలలో పరిస్థితుల్ని బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 60శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని