టాలీవుడ్ నటుడిపై కన్నడ స్టార్స్ ఆగ్రహం
కన్నడ లెజెండరీ నటుడు విష్ణువర్ధన్‌పై టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు అనుచిత వ్యాఖ్యాలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ తప్పుగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్, సుదీప్, పునీత్ రాజ్‌కుమార్, సుమలత తదితరులు ....
సారీ చెబుతూ కన్నీరుమున్నీరైన విజయ్ రంగరాజు
బెంగళూరు: కన్నడ లెజెండరీ నటుడు విష్ణువర్ధన్‌పై టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ తప్పుగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్, సుదీప్, పునీత్ రాజ్‌కుమార్, సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ రంగరాజు తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భూమిపైలేని వ్యక్తి గురించి కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సుదీప్ వీడియో విడుదల చేశారు.
ఈ వివాదంపై పునీత్ రాజ్‌కుమార్, యశ్ స్పందిస్తూ కన్నడంలో ట్వీట్లు చేశారు. ప్రాంతంతో సంబంధం లేకుండా మనతో పనిచేసే తోటి ఆర్టిస్టుల్ని గౌరవించడం ఓ ఆర్టిస్టుకు ఉండాల్సిన ముఖ్య లక్షణమని పునీత్ పేర్కొన్నారు. కన్నడ ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌ను అవమానిస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనికి విజయ్ రంగరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టిస్టు సేవలను గౌరవించడంలో మొత్తం చిత్ర పరిశ్రమ ఐకమత్యంగా ఉంటుందని తెలిపారు. మనమంతా మునుషుల్లా ఉందామని పునీత్ పేర్కొన్నారు.
విజయ్ రంగరాజుపై తగిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ అల్లుడు అనిరుద్ధ జట్కర్ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల్ని కోరారు. అంతేకాదు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయనపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ రంగరాజు కన్నీరుమున్నీరయ్యారు. పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశానని క్షమాపణలు చెప్పారు. ‘మీ కాళ్లు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి.. విష్ణువర్ధన్ అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేసుండకూడదు.. కానీ చేశాను. నన్ను మన్నించండి. సుదీప్, పునీత్, ఉపేంద్ర.. నన్ను క్షమించండి’ అని కంటతడి పెట్టుకున్నారు.
ఇవీ చదవండి..
2040 కల్లా ప్రజలందరికీ ఈ మాంసమే: పూరి
చనిపొమ్మంటూ ఫోన్‌కాల్స్ వచ్చాయి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని