Vivaha Bhojanambu: దేవీ కల్యాణ వైభోగమే

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా హీరో సందీప్‌ కిషన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్‌ అబ్బరాజు దర్శకుడు. అర్జావీరాజ్‌

Updated : 21 May 2021 11:00 IST

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా హీరో సందీప్‌ కిషన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్‌ అబ్బరాజు దర్శకుడు. అర్జావీరాజ్‌ కథానాయిక. అనివీ స్వరాలందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్రం నుంచి ఓ పెళ్లి పాటను విడుదల చేశారు. ‘‘దేవీ కల్యాణ వైభోగమే.. రాధా కల్యాణ వైభోగమే’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ గీతానికి కిట్టు విస్సాప్రగడ సాహిత్యమందించగా.. ఆంటోనీ దాసన్‌, చిన్మయి ఆలపించారు. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ ఇది. సందీప్‌ కిషన్‌ నెల్లూరు ప్రభ అనే క్యాబ్‌ డ్రైవర్‌గా కీలక పాత్రలో సందడి చేయనున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని