‘హీరామండి’కి ‘పాకీజా’తో పోలికేంటి?

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్న వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో

Updated : 10 Sep 2021 07:34 IST

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్న వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. వేశ్యల సంస్కృతి నేపథ్యంలో సాగే కథ ఇది. గతంలో భన్సాలీ రూపొందించిన ‘పాకీజా’ ఇలాంటి కథతోనే తెరకెక్కి మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ‘హీరామండి’ని ‘పాకీజా’తో పోలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భన్సాలీ స్పందించారు. ‘‘వేశ్యల నేపథ్యం అనేది తప్పితే ‘హీరామండి’కి ‘పాకీజా’తో ఎలాంటి పోలికా లేదు. వేశ్యల మీద సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు మనసులో పాకీజా ఎలా ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ‘హీరామండి’ సిరీస్‌ ‘పాకీజా’ చిత్రాన్ని గుర్తు చేయదు. మనకు ఇప్పటికే ‘పాకీజా’ ఉన్నప్పుడు మరోటి అవసరం లేదు’’ అని చెప్పారు. ‘హీరామండి’ ఒకటో సీజన్‌లో ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. రెండో సీజన్‌లో అంతకుమించి ఉంటాయని తెలుస్తోంది. తొలి ఎపిసోడ్‌కు భన్సాలీ దర్శకత్వం వహిస్తుండగా, మిగిలిన ఆరింటికి ఆయన సహాయకుడు విభు పురి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సిరీస్‌లో అలియాభట్‌, హ్యుమా ఖురేషి, సోనాక్షి సిన్హా తదితరుల్ని ఎంపిక చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని