రంగమార్తాండతో రంగమ్మత్త పేరు మారుతుందా?

రంగస్థలం సినిమాలో నటించిన అనసూయ భరద్వాజ్‌ తన ఇంటి పేరును రంగమ్మత్తగా మార్చుకుంది. ఆ సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్రలో  నటించినప్పటికి అద్భుతమైన నటనతో ఆమె అందర్ని ఆకట్టుకుంది. రంగమ్మత్త కంటె మంచి పాత్రలో ఆమె నటించనిప్పుడే  ఆ పేరును చెరిపేయగలదు.

Updated : 12 Oct 2020 13:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన మాటలు, పంచ్‌ డైలాగ్‌లు, చిరునవ్వులతో బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్నారు అనసూయ. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా ఆమె నటన అందరినీ కట్టిపడేసింది. దీంతో అప్పటి నుంచి ఆమె అందరికీ రంగమ్మత్త అయిపోయారు. అంతేకాదు, ఆ సినిమా తర్వాత నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల వైపు అనసూయ మొగ్గు చూపుతున్నారు.

తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రం ‘రంగ మార్తండ’. ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ పాత్ర ఎంత కీలకమో ఇందులో కూడా ఆ స్థాయిలోనే పాత్ర తీరు ఉంటుందని టాలీవుడ్‌ టాక్‌. ఆమె దేవదాసి పాత్రలో కనిపిస్తారని సమాచారం. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు కూడా ఇందులో నటిస్తుండటం విశేషం. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని