ఈ వర్చువల్‌ రియాలిటీ ఏదైతే ఉందో..సూపర్‌

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయడంతో పలువురు ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. కరోనా పరిస్థితుల వల్ల కొద్ది మంది బంధుమిత్రుల...

Updated : 09 Aug 2020 13:12 IST

రానా-మిహీకాకు ప్రముఖుల శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయడంతో పలువురు ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. కరోనా పరిస్థితుల వల్ల కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే శనివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక కనులపండువగా నిర్వహించారు. అయితే, పెళ్లికి హాజరుకాని వారికోసం దగ్గుబాటి కుటుంబం వినూత్నంగా వర్చువల్‌ రియాలిటీ కిట్లను అందజేసింది. దాంతో ఎవరైనా ఆ వివాహాన్ని లైవ్‌లో తిలకించాలంటే ఉన్న చోటు నుంచే ఆ కిట్లను కళ్లకు ధరిస్తే ఆ వేడుకలో ప్రత్యక్షంగా తామున్నట్లు అనుభూతి కలుగుతుంది. చాలా మంది ప్రముఖులు ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంతో దగ్గుబాటి కుటుంబం తమ బంధుమిత్రులకు ఈ విధంగా అవకాశం కల్పించింది. ఇక పెళ్లికి మెగా కుటుంబం నుంచి రామ్‌చరణ్‌, ఉపాసన హాజరయ్యారు. అలాగే అక్కినేని కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. మిగతా సినీ ప్రముఖులు ఇళ్ల నుంచే ప్రత్యక్షంగా వీక్షించారు.

కలకాలం సంతోషంగా ఉండాలని..

* రానా, మిహీకా శుభాకాంక్షలు‌. జీవితకాం ఇలాగే ప్రేమ, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా

- మహేశ్‌ బాబు

* చివరికి నా హల్క్‌కి వివాహమైంది. రానా, మిహీకా ఇద్దరూ సంతోషంగా ఉండాలి

- రామ్‌చరణ్‌

* కంగ్రాట్స్‌ రానా, మిహీకా. ఇకపై మనమంతా సంతోషంగా ఉంటాం 

- ఉపాసన 

* నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు 

- నాగశౌర్య

* ఐకానిక్‌ బ్యాచిలర్‌ చివరి క్షణాలను చూస్తున్నా.. శుభాకాంక్షలు బాబాయ్‌ 

- నాని

* హ్యాపీ మారీడ్‌ లైఫ్‌ రానా, మిహీకా. వీఆర్‌ టెక్నాలజీతో అక్కడ లేకున్నా అక్కడే ఉన్నట్టు ఫీల్‌ అయ్యి చూసే దాకా వచ్చాం. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో సూపర్‌ 

- అనిల్‌ రావిపూడి

* కలకాలం లాక్‌డౌన్‌ అవ్వడానికి సరైన మార్గం. కంగ్రాట్స్‌ రానా. మీ ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలి

- అక్షయ్‌ కుమార్‌

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని